సామాజిక దూరం తప్ప మరే మార్గము లేదు

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి

social distance
social distance

న్యూయార్క్‌: ప్రపంచదేశాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నప్పటికి కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌ పరిశోధకులు పలు విషయాలను వెల్లడింవచారు. 2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే దీని నుండి విముక్తి పొందగలమని పేర్కోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నప్పటికి కూడా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి అని తెలిపింది. కరోనా ప్రభావం మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని తెలిపారు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే దీని భారి నుండి కోలుకుంటున్నారని పేర్కోన్నది. వ్యాక్సిన్‌ కనుగొనక పోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని సూచించింది. ప్రస్తుతం కరోనా నివారణకు సామాజిక దూరం తప్ప మరే మార్గము లేదని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/