నటుడు మిథున్‌ చక్రవర్తికి మాతృవియోగం

సీనియర్ నటుడు మిథున్‌ చక్రవర్తి తల్లి శాంతిరాణి దేవి కన్నుమూశారు. కొద్దీ నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మిథున్‌ చక్రవర్తి కుమారుడు నమాషి చక్రవర్తి నాయనమ్మ మరణాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు.

‘మా నాయనమ్మ ఇక మాతో ఉండదు’ అని పేర్కొన్నాడు. కాగా, మిథున్‌ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్‌ చక్రవర్తి 2020లో తన 95వ ఏట కిడ్నీ విఫలమై ప్రాణాలు కోల్పోయాడు. శాంతిరాణి దేవి మృతి పట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. శాంతిరాణి దేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం మిథున్‌ చక్రవర్తి డ్యాన్స్‌ బంగ్లా డ్యాన్స్‌ అనే రియాలిటీ సో షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సూపర్‌ హిట్‌ అయిన ఈ రియాలిటీ షో 12వ సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతున్నది.