వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

YouTube video
Distribution of Crop Insurance to Farmers Under YSR UCHITHA PANTALA BEEMA by Hon’ble CM

అమరావతి: సిఎం జగన్‌ ఏపిలో వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మెత్తాన్ని జమచేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ… ‘వైఎస్‌ఆర్‌‌ పంటల బీమా పథకంతో మరో అడుగు ముందుకు వేశాం. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా.. ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. 2019లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు.. రూ.1252 కోట్ల బీమా సొమ్మును అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నాం.. అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/