ఈటెల రాజేందర్ ను పరామర్శించిన పూనమ్ కౌర్

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ మంగళవారం ఈటెల రాజేందర్ ను పరామర్శించింది. రీసెంట్ గా ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య (104) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

కాగా ఈరోజు హనుమకొండ జిల్లా కమలపూర్ లో సినీ నటీ పూనమ్ కౌర్ ఈటల రాజేందర్ ను పరామర్శించారు. ఈటెల తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్ల‌య్య ఆర్‌వీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. కాగా మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ రెండో కుమారుడు. ఇక ఈటెల రాజకీయాల విషయానికి వస్తే…టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన రాజేందర్..బిజెపి పార్టీ లో చేరి , హుజురాబాద్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. రాజేందర్ సతీమణి జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నిక కోసం పనిచేస్తున్నారు.