ఒత్తిడిని తగ్గించే పూల పరిమళాలు

మానసిక వికాసం

కాలం ఏదైనా , కారణాలు ఎన్ని చెప్పినా నిత్యం ఒత్తడి విసిరే సవాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటాయి.. ఈ పరిస్థితికి చెక్ చెప్పి సాంత్వన పొందేందుకు మర్దన ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.

Stress-relieving floral scents

లావెండర్, మల్లె , గులాబీ వంటి పాల పరిమళాల్లో సాంత్వనిచ్చే సుగుణాలు ఎన్నో ఉన్నాయట . మరి ఇంకేం అలంటి పూల సుగంధాలు నూనెల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని పావు కప్పు బాదం నూనెలో ఓ రెండు చుక్కల ఈ సువాసన తైలాన్ని కలిపి ఒంటికి రాసి మర్దన చేయండి. ఒంట్లో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.. మేను వన్నెలీనుతుంది .

కొబ్బరి నూనెను వేడి చేసి దానికి కాస్త తేనె , చిటికెడు కర్పూరం పొడి చేసి కలపండి.. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసి మృదువుగా మర్దన చేయండి.. ఇది ఒంటి మీద ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. ఇలా కనీసం వారంలో రెండు సార్లు అయినా చేస్తుంటే ఒత్తిడి పరారవుతుంది.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/