డ్రగ్స్ కేసులో 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు..?

టాలీవుడ్ ఇండస్ట్రీ ని మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదేలు చేస్తుంది. గతంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు అందజేయగా..ఆ తర్వాత విచారణ లో క్లిన్ చిట్ రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం తో మరోసారి ఇండస్ట్రీ పేరు మారుమోగిపోతుంది. పోలీసుల విచారణలో పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ వ్యవహారం తో సంబంధం ఉన్నట్లు తేలింది.

సినీ ప్రముఖులతో కేపీ చౌదరి సంబంధాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యినట్లు సమాచారం. ఈ తరుణంలోనే… సోషల్ మీడియా వేదిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కేపీ తో ఫ్రెండ్షిప్ తప్ప డ్రగ్స్ కు సంబంధం లేవని చెబుతున్నారు. మరి ఎవరెవరు నోటీసులు అందుకుంటారో చూడాలి.