ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం

వైస్సార్సీపీ నుండి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఉండవెల్లి శ్రీదేవి తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల ఫై అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ఉండవల్లి శ్రీదేవి వైస్సార్సీపీ ఫై నిప్పుల వర్షం కురిపించింది.

గత మూడు రోజులు గా వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని , నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారని.. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళానని తెలిపింది. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు. నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా అని నిలదీశారు. లేదా సీసీ కెమెరా పెట్టారా అని ప్రశ్నించారు. నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు.. నన్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. అంతే కాకుండా దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే శ్రీదేవి డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ ఓటమికి కారణమైందని ఆరోపిస్తూ వైస్సార్సీపీ కార్యకర్తలు ఆమె కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే ఆమె కార్యాలయంలోని పార్టీ ప్రచార రథాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీకి మోసం చేసిన శ్రీదేవిని అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించిందని, అలాంటప్పుడు ఆమె వద్ద పార్టీకి సంబంధించిన ప్రచారం రథం ఎందుకని కార్యకర్తలు గొడవకు దిగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.