ఉన్నావ్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎస్పీ మద్దతు

అఖిలేష్ యాదవ్ స్పందన

Asha Singh,

Lucknow: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ, ఉన్నావ్‌ స్థానం నుంచి ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను రంగంలోకి దింపింది. కాగా ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. ఉన్నావ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఆ స్థానం నుంచి ఎస్‌పీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉన్నావ్‌ అత్యాచార కేసు బాధితురాలి తల్లికి తాము అడ్డురామని వెల్లడించారు. ఆమెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అఖిలేష్ ప్రకటించారు.

తెర – సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/