యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న హీరో నాని

గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సినీ నటుడు నాని దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని, స్వామివారి సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని కితాబిచ్చారు.

పూర్తి కృష్ణశిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం చరిత్రలో నిలిచిపోనున్నదని నాని అన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ భాగస్వాములైన వైటీడీఏ అధికారులు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, ప్రధాన స్తపతి, ఉపస్తపతులు, శిల్పులు, ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం నాని దసరా మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని , కీర్తి సురేష్ జంటగా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా మార్చి 30 , 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే నాని తాలూకా లుక్ రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. ఈ సినిమాలో నాని బొగ్గు గ‌నిలో ప‌ని చేసే కార్మికుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో చిత్రంలో న‌టించ‌ని విధంగా గుబురు గ‌డ్డం పెట్టుకుని కార్మికుడు ఎంత మాసీగా ఉంటాడో అలాంటి లుక్‌లో కనిపించ‌బోతున్నారు.