అపరిచిత కాల్స్ కు చెక్ పెట్టేయండి!

మొబైల్ ఉపయోగించేటపుడు కొన్ని జాగ్రత్తలు

వృత్తి రీత్యా అత్యవసర కాల్స్ మాట్లాడటానికే చాలామందికి తీరిక దొరకట్లేదు అలాంటిది అనవసర కాల్స్ వలన సమాయమూ వృధా అవటంతో పాటు తమ వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లుతోందని మహిళలు వాపోతున్నారు. అయితే , దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది మహిళలు అపరిచిత కాల్స్ వస్తున్నాయని, అందులో 9 శాతం మందిని నిత్యం ఇలాంటి కాల్స్ వేధిస్తుంటే , 52 శాతం మందికి వారానికోసారైనా ఇలాంటి కాల్స్ వస్తున్నట్టు తేలింది..

76 శాతం మంది మహిళలు ఇలాంటి కాల్స్ రూపంలో అజ్ఞాత వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొంటుంటే, ఇలా కాల్ చేసే వారిలో 4 శాతం మంది ఆ మహిళలకు పరిచయస్తులే కావటం గమనార్హం.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఢిల్లీ, కోలకతా , చెన్నై, పూణే ల్లోనే నమోదు అవుతున్నాయట..

ఇక ఇలాంటి అపరిచిత కాల్స్ పై సదరు మొబైల్ ఆపరేటర్ కు ఫిర్యాదు చేయటానికే చాలా మంది మహిళలు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అలాగే 85 శాతం మంది ఆయా ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తున్నారు, తమకు న్యాయం జరగదన్న ఉద్దేశ్యంతో కేవలం 12 శాతం మందే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు సర్వేలో వెల్లడైంది..

ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు..

ఈ రోజుల్లో కెరీర్ , వ్యక్తిగత పనులు ఒకటి రెండు సార్లు తెలియక ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనా .ఆపై జాగ్రత్త పడాలంటే కొన్ని చిట్కాలు పాటించటం మంచిదని నిపుణులు అంటున్నారు.. వ్యక్తిగత మొబైల్ నంబర్లను గోప్యంగా ఉంచుకోవాలి.. మీకు నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే ఛాఋఏ చేయటం మంచిది..

ఈమధ్య కొన్ని వెబ్ సైట్ ల్లో సమాచారం చూడాలన్నా , తెలుసుకోవాలన్నా ముందు మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తోంది. అలాంటపుడు గబా గబా మీ నెంబర్ అందులో పొందుపరచకుండా, ముందు సదరు వెబ్ సైట్ ప్రామాణిక మైనదేనా? అన్న విషయం తెలుసుకోవాలి.. ఇందుకోసం ఆయా సంస్తలకు ఫోన్ చేయవచ్చు.. లేదంటే మీకు తెలిసిన వారి ద్వారా నైనా ఈ విషయం అడిగి తెలుసుకోవచ్చు.. కొంతమంది ఫోన్ నెంబర్ న లాగిన్ ఐ డి ,పాస్ వార్డ్ గా పెట్టుకుంటారు.. దీనివల్ల కూడా మీ నెంబర్ హాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి..

కొంత మంది కొన్ని వెబ్ సైట్స్ నుంచి తమకు కావాల్సిన సమాచారాన్ని , లేదంటే సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవటానికి తమ్ ఫోన్ నంబర్లను ఎంటర్ చేస్తుంటారు.. దీనివల్ల మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎంబర్ వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది.. అది ప్రామాణికమైన వెబ్ సైట్ అయితే సరే.. లేదంటే ఏదో ఒక సమయంలో వాళ్ళ నుంచి మీకు వేధింపులు తప్పవు.

అపరిచిత కాల్స్, మార్కెటింగ్ కంపెనీల నుంచి అనవసర కాల్స్, సందేశాలు రాకుండా అడ్డుకోవాలంటే,, ముందు మీరు ‘నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్టరీ ‘లో మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేసుకోవాలి.. మొబైల్ కు వచ్చిన అపరిచిత సందేశాలను, వెబ్ సైట్ లింక్స్ ని ఆత్రుతతో ఓపెన్ చేసి చూడటం అస్సలు కరెక్ట్ కాడి.. దీనివల్ల మీ నెంబర్ హాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ..

కొంత మందికి తరచూ ఒకే నెంబర్ నుంచి అపరిచిత కాల్స్, సందేశాలు రావటం.. వంటివి జరుగుతుంటాయి.. ఇలాంటప్పుడు ఆ నెంబర్ బ్లాక్ చేయాలనుకుంటే, కాల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్లాక్ చేయచ్చు. అపరిచిత కాల్స్ కి స్పందించకుండా ఉండాలంటే.. కొన్ని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్స్ ఇందుకు ఉపయోగ పడతాయి.

అపరిచిత వ్యక్తులు పదే పదే ఫోన్ చేసి వేధిస్త్తున్నట్లైతే వాళ్ళ మాటలు రికార్డు చేసుకోవటానికి కొన్ని ఫోన్స్ లో ఆటోమేటిక్ వాయిస్ రికార్డు ఆప్షన్ ఉంటుంది.. ఒకవేళ లేకపోయినా, కాల్ రికార్డింగ్ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న సరిపోతుంది.. ఈ ఆధారంతో మీరు వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయచ్చు

‘నాడి’ (ఆరోగ్య సంబంధ విషయాల కోసం ) క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/health1/