శ్వాస సమస్యల్నిదూరం చేసే గసగసాలు
ఆరోగ్య చిట్కాలు
తెల్లగా, చిన్నచిన్న పూసల్లా, మెత్తగా ఉండే గసగసాల్ని మనం వంటల్లో వాడుతున్నాం. పూర్వం వీటిని మందుల తయారీలో వాడేవాళ్లట. మనం తప్పనిసరిగా వాడే వాటిలో ఈ సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి
మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు ఎక్కువే. చాలా మంది ఇవి వంటకు మాత్రమే వాడుతుంటారు.
కొందరైతే మిగతా మసాలా దినుసులు వాడుతారు గాని గసగసాల్ని వాడేందుకు అంతగా ఇష్టపడరు. అవి లేకపోతేనేం మిగతావి ఉన్నాయి కదా అనుకుంటారు.
కాని గసగసాలు కూరలకు ఎంతో రుచినిస్తాయి. కుర్మాలాంటి వాటిలో గసగసాల్ని వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది.
గసగసాల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి ఉంటుంది.
వీటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. గసగసాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది.
తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టని వారు వీటిని వాడితే మంచిది. రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు.
మంచి నిద్ర వస్తుంది. వీటిలో శ్వాస సంబంధిత సమస్యల్ని దూరం చేసే గుణాలున్నాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.
గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి చక్కరతో కలిపి ఉదయం, సాయంత్రం సగం టీ స్పూన్ అంత తీసుకుంటే మంచిది.
కడుపులో మంట, ఎసిడిటీ ఉన్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని కదా వీటిని ఎక్కువగా మాత్రం వాడకూడదు. కొన్ని చోట్ల గసాలతో పాయం కూడా చేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/