త్రీ స్టెప్ లో తళుక్కుమనేలా !

అందమే ఆనందం

Face Pack
Face Pack

ప్రత్యేక సందర్బాలలో మాత్రమే చర్మ సంరక్షణ మీద దృష్టి పెడుతుంటారు కొందరు. అలాకాకుండా వారానికి ఒకసారి అయినా ‘త్రీ స్టెప్‌ స్కిన్‌కేర్‌ విధానాన్ని అవలంబించాలి. దీంతో చర్మంకాంతులీను తుంది. అందుకు ఏం చేయాలంటే..

సోప్‌ ఫ్రీఫేస్‌ వాష్‌ :

చర్మ సంరక్షణలో ప్రధానమైనది ముఖాన్ని సబ్బుతో కాకుండా ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం. ఇది చర్మం మీది మురికిని తొలగించి, తాజాదనాన్ని ఇస్తుంది. అయితే వేప, పసుపు ఉన్న ఫేస్‌వాష్‌ ఎంచుకోవాలి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెటిమలు, ఇతర సమస్యల నుంచి రక్షణనిస్తాయి.

స్క్రబ్బింగ్‌ :

ఫేస్‌వాష్‌తో పాటు స్క్రబ్బింగ్‌ కూడా అవసరమే . స్క్రబ్బింగ్‌ చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ తొలగి పోతాయి. చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. అంతేకాదు చర్మ రంద్రాలు తెరచుకుంటాయి. చర్మ రంద్రాల్లో చేరిన మలినాలను వదలగొడతాయి కూడా.

ఫేస్‌ప్యాక్‌ :

మంచి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల మురికి వదిలి చర్మం జీవాన్ని పొందుతుంది. మృదువుగా మారుతుంది. చర్మం స్వభావం మెరుగుపడుతుంది. ఇంటి వద్ద ముల్తానీ మట్టితో తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ముల్తానీ మట్టి ముఖం మీది జిడ్డును పీల్చివేస్తుంది. ముఖాన్ని కాంతిమంతంగా చేస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/