గుండె ఆరోగ్యానికి ఆవిరి పదార్థాలు

సాధారణంగా ఆవిరిమీద ఉడికించిన పదార్థాలు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఇలా తీసుకున్న పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. ఈ పదార్థాల్లో సహజ సువాసనలూ పోవు. పదార్థాలను ఆవిరిపై ఉడికించేటప్పుడు నూనె అవసరం ఉండదు. దాంతో వాటి నుంచి తక్కువ కెలొరీలు అందుతాయి. శరీరంలో కొవ్వు పేరుకోదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నూటికి నూరు శాతం లభిస్తాయి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆహారం విషతుల్యమయ్యే అవకాశాలు తక్కువ. క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. జీర్ణసంబంధ సమస్యలతో బాధపడే రోగులు ఉడికించిన ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీన్ని మించిన ఆహారం ఉండదు.

ఆవిరిమీద ఉడికించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు సమతూకంలో ఉంటాయి. మాంసకృత్తులూ అందడంతో శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు అంతగా రుచించవు. అందుకే నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, మిరియాలపొడి, ఉప్పు వంటివి జతచేసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుని తింటే మంచిది. సాధారణంగా మనము నూనెలేనివి ఇడ్లీలు మాత్రమే అనకుంటాం. దుంపలు వంటివి వాటిని కూడా చక్కగా ఉడికించివి తింటే వాటిలోని పోషకాలు పిండిపదార్థాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/