పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు పోషకాల బాదం

Nutritional almonds

బాదం అనేది ఒక డ్రైఫ్రూట్‌, ఇందులో పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్‌ ఇ, మెగ్నీషియం అధికంగా ఉండే బాదం కూడా ఫైబర్‌కు మంచి మూలం. ఇది జీర్ణక్రియలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొంతమందికి బాదం జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. కడుపు ఉబ్బరం కలిగిస్తుంది. మలబద్ధకం నివారించడానికి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి, పిల్లలు, పెద్దలు రోజుకు 20 నుండి 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవాలి. ఒక కప్పు బాదంపప్పులో 18 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. అందుకే దీనిని ఆరోగ్య చిరుతిండి అంటారు. వీటిలోని ఫైబర్‌ కొందరికి ప్రేవులలో గ్యాస్‌ ఉత్పత్తి చేస్తుంది.
ఒకేసారి ఎక్కువ బాదం తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా వాపు, కడుపునొప్పి వంటి ఇతర లక్షణాలు సంభవించవచ్చు.
కొందరికి బాదం తినడం వల్ల వేడి చేస్తుంది.
ఆహారంలో ఫైబర్‌ అధికంగా తీసుకోవడం కూడా కడుపునొప్పికి ఒక సాధారణ కారణం. అందువల్ల ఎక్కువ ఫైబర్‌ తీసుకోవడం మానుకోవాలి. బాదంలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.
చెట్టు నుండి లభించే గింజల వర్గంలో బాదంపప్పు ఉంటుంది. వాల్‌నట్స్‌, బ్రెజిల్‌నట్‌, జీడిపప్పు, హాజెల్‌ నట్స్‌, పిస్తా వంటివి ఈ వర్గంలోని గింజల రకాలు. పిల్లలు, పెద్దలలో సాధారణంగా కనిపించే అలర్జీలలో బాదం కూడా ఒకటని అలెర్జీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్సిట్యూట్‌ పేర్కొంది. అలెర్జీ రోగనిరధక వ్యవస్ధ ద్వారా ప్రేరేపించబడినప్పటికీ, కడుపునొప్పి, ఉబ్బరం, వికారం, వాంతులు, విరేచనాలు కలిగిస్తాయి. జీర్ణశయాంతర సమస్యల వంటివి అలెర్జీ ఇతర లక్షణాలు. బాదం ఎక్కువగా తినడం వల్ల నోటి ప్రాంతం చుట్టూ జలదరింపు, దురద. ఈ రకమైన బాదం నట్స్‌ తినడం వల్ల అలెర్జీ ఉన్న వారిలో తీవ్రమైన ప్రమాదానికి గురి చేస్తుంది. బాదం ఎక్కువగా తింటుంటే వెంటనే మోతాదును తగ్గించడం ద్వారా, తేలికపాటి కడుపు ఉబ్బరాన్ని నివారింవచ్చు. బాదం తినడం అలవాటు లేనివారికి, నెమ్మదిగా వారి అల్పాహారానికి బాదంపప్పు వేసి దానికి సర్దుబాటు చేయాలి.
దీనికి కొన్ని వారాలు పట్టవచ్చు.
నెమ్మదిగా కడుపు సమస్య తగ్గుతుంది. సిమెథికోన్‌ పిల్‌ తీసుకోవడం ప్రాక్టీస్‌ చేయడం వల్ల ప్రేవులలో దాగి ఉన్న వాయువును కూడా పూర్తిగా తొలగించవచ్చు.
ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
కానీ మా సలహా ఏమిటంటే, కడుపు ఉబ్బరం, కడుపునొప్పితో బాధపడుతున్నా దీర్ఘకాలిక విరేచనాలతో బాధపడుతుంటే, నిర్లక్ష్యం చేయవద్దు. లక్షణాలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఏదేమైనప్పటికీ డ్రైఫూట్స్‌ వంటివి మితంగా తింటేనే మేలు. అది తప్పక గమనించుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/