చికెన్‌ మసాలా కూర

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Chicken spice curry
Chicken spice curry

కావలసినవి

చికెన్‌: కిలో,
చిన్న (సాంబారు) ఉల్లిపాయలు: పది,
టొమాటోలు: మూడు,
పచ్చిమిర్చి: నాలుగు,
కొబ్బరి/ఆవనూనె: అరకప్పు,
పసుపు:అరటీ స్పూన్‌,
దాల్చిన చెక్క: అంగుళం ముక్క,
లవంగాలు: నాలుగు,
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఎండుమిర్చి: పది,
మిరియాలు: అరటీ స్పూన్‌, జీరకర్ర: అరటీ స్పూన్‌,
ఉప్పు: తగినంత, కరివేపాకు: 2 రెబ్బలు,
కొత్తిమీర తురుము: టేబుల్‌ స్పూన్‌

తయారు చేసే విధానం

పసుపు, దాల్చినచెక్క, లవంగాలు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మెత్తగా రుబ్బాలి. బాణలిలో టేబుల్‌ స్పూన్‌ నూనే వేసి కాగాక పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి.

తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి నూనే బయటకు వచ్చేవరకూ వేయించాలి.
ఇప్పుడు మరో బాణలిలో మిగిలిన నూనే వేసి కాగాక రుబ్బిన పేస్టు వేసి అది కూడా వేగాక, చికెన్‌ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.

తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత వేయించిన ఉల్లిముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుముతో అలంకరించి దించితే సరి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/