ఇంటింటా మహిళలకు చిట్కాలు
పట్టు చీరలు భద్రంగా

తేలికగా ఉండే పట్టుచీరలు మంచివి కావు. బరువుగా ఉండేవే మంచి పట్టు చీరలు.
చీర ఒక కొసను చేతితో నలిపితే ముడతలు పడతాయి. ఆ ముడతలు కొంచెం సేపట్లోనే పోతే ఆ పట్టు మంచిది. చీర మడత గట్టిగా ఉండాలంటే దాన్ని మడత పెట్టేటప్పుడు మధ్యలో ఒక న్యూస్ పేపరును వేసి మడత బెట్టాలి.
పట్టుచీరలు కుంకుడుకాయ రసం కలిపిన నీళ్లలో తడపడం మంచిది.
పట్టు వస్త్రాలను ఎప్పుడూ ఎండలో ఆరవేయకూడదు. నీడలోనే ఆరవేయాలి. నీరెండలో కూడా ఆరేయవచ్చు.
పట్టుచీర మీద మరక పడితే వెంటనే దాన్ని శుభ్రం చేయాలి
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/