విద్యార్థిని పరీక్షా హాలులోకి పంపని సిబ్బంది
పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యం

ఖమ్మం: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఒక్క నిమిషం ఆలస్యం అయిన కారణంగా ఓ విద్యార్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా అతడు పరీక్ష రాసే అవకాశం కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వైరాలో గ్రేస్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి సాయి కిరణ్ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో అతడిని పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో అతడు పరీక్షా కేంద్రం వద్దే నిలబడి పడిగాపులు కాస్తున్నాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/