వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక ఆ నిధులు తీసుకురాలేకపోయింది

ప్రజా సమస్యలపై ఒక్కరూ కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు

nadendla manohar
nadendla manohar

విశాఖపట్టణం: వైఎస్‌ఆర్‌సిపిది అసమర్థ పాలన, వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం ఏటా రూ. 150 కోట్లు ఇస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక ఆ నిధులు తీసుకురాలేకపోయింది. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు కూడా ధైర్యంగా ప్రజా సమస్యలపై మాట్లాడలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యకహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విజయనగరం, విశాఖపట్టణం రూరల్‌ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానులంటూ సరైన ప్రణాళిక లేకుండా వెళ్తున్నారని మనోహర్‌ ఆరోపించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/