ఇజ్రాయెల్‌లో మరో ముగ్గురికి కరోనా

ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

Israel
Israel

ఇజ్రాయెల్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బాధితుల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. ఇజ్రాయెల్‌లో మరో ముగ్గురికి కరోనావైరస్ సోకింది. ఈమేరకు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీంతో అక్కడ కరోనా కేసుల సంఖ్య 15కు చేరింది కరోనా బారిన పడిన వ్యక్తుల్లో ఓ పేషెంట్ గత నెల 29న ఇటలీ నుంచి తిరిగి వచ్చాడని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ముగ్గురినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. కాగా చైనా వెలుపల కొత్తగా మరో 1700 పైగా కొవిడ్19 కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన సంగతి తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/