నంద్యాలలో శ్రీరామ నవమి వేడుకల్లో వైస్సార్సీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఎంతో భక్తిశ్రద్దలతో భక్తులు రాములవారి కల్యాణంలో పాల్గొన్నారు. అయితే ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ – టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లి గ్రామంలో అధికార పార్టీ వైస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మల్లంపల్లిలో శ్రీరాముడి ఆలయం వద్ద ఇరువర్గల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పెద్దదిగా మారి..ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో వైస్సార్సీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో గాయపడిన వారిని డోన్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లంపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.