యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో డ్రోన్స్ కలకలం

తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి రోజున డ్రోన్స్ కలకలం సృష్టించాయి. శ్రీరామ నవమి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో నవమి వేడుకలు అంబరాన్ని తాకాయి. రామ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారి కళ్యాణం చూసి తరించారు. ఇక యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలోను శ్రీరామ నవమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవం గా జరిగాయి. ఈ క్రమంలో ఆలయంలో డ్రోన్స్ కలకలం సృష్టించాయి. ఆలయ ప్రాంగణంలో డ్రోన్ ను చూసిన భక్తులు ఏదో జరుగుతుందని భయంతో పరుగులు తీశారు. అనుమతి లేకుండా డ్రోన్స్ కెమరాలతో దేవాలయాన్ని చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆలయ సిబ్బంది గమనించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రన్స్ ఆపరేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్ లుగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి పరిమిషన్ తీసుకోకుండా ఎందుకు డ్రోన్స్ ఆపరేట్ చేశార్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగమశాస్త్రాల ప్రకారం ఆలయ గోపరం పై విమానాలు మరే ఇతర విహంగాలు ఎగురకూడదు అనే నియమం ఉంది. అందుకే ఆలయ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలను నిషేదించారు. ఈ నేపథ్యంలో డ్రన్స్ తో చిత్రీకరించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఉన్నా.. ఈ ఇద్దరు యువకులు ఎలా ఆపరేట్ చేశారు.. డ్రోన్ కెమెరాలను ఎందుకు ఉపయోగించారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.