నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

cm Revanth Reddy

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో గురువారం కాంగ్రెస్‌ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరనుననారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ తిరువనంతపురం వెళ్లారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార యాత్ర సమరాగ్నిని శుక్రవారం కాసర్‌గోడ్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.