ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
Sri Nara Chandrababu Naidu Addressing The Media About the Election Violations Committed by YCP
అమరావతి: ఏపిలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మళ్లీ వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ఆర్సిపి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దీనిపై మాట్లాడుతూ, రంగులు వేయడానికి, మళ్లీ తొలగించడానికి దాదాపు రూ.3000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ఎవడబ్బ సొమ్ము అని ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ డబ్బు వైఎస్ఆర్సిపి నాయకులు కడతారా అని ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎక్కడైనా ఉందా ఇలా రంగులేయడం? ఇలా ఏ ప్రభుత్వమన్నా చేసిందా? ఉన్మాదం కాకపోతే మరేంటి? ఇంత విచ్చలవిడిగా చేయడం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆఖరికి బాత్రూములు, జాతీయ జెండాలకు కూడా పార్టీ రంగులు వేశారు’ అంటూ విమర్శించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/