నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో గుండెల్లో రైళ్లు

అక్రమాలను ఆధారాలతో నిరూపించి చిప్పకూడు తినిపిస్తాం: నారా లోకేశ్

అమరావతి : గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన సీఎం జగన్ పాపాలు పండే రోజు అతి దగ్గరలోనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టి జైలుకు పంపిస్తామన్నారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ బంధువర్గానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో షాక్ తగిలిందని, వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

మైనింగ్ పేరుతో జరుగుతున్న దందా ఒక్కొక్కటీ బయటకు వస్తోందని, మాఫియా పునాదులు కదులుతున్నాయని లోకేశ్ అన్నారు. బాక్సైట్ కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ అండ్ కో, వారి అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులు చిప్పకూడు తినడం ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/