రోజుకు రూ.200 ఇన్‌వెస్ట్‌మెంట్‌.. అదిరిపోయే లాభం!

Money invest
Money invest

న్యూఢిల్లీ: డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరికే ఇది సాధ్యమౌతుంది. మంచి రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చు. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మంచి రాబడి దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వె్స్ట్ చేసే వారు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ట్రిక్స్‌తో దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావొచ్చు. మంత్లీ మ్యూచువల్ ఫండ్స్‌ సిప్‌లో వార్షిక స్టెప్ అప్ టిప్స్ కూడా ఇందులో ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో 20 ఏళ్లు లేదా ఆపైన ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. 15 నుంచి 17 శాతం వరకు రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/