వైష్ణవ్ తేజ్ మూవీ నుండి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్

ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. ప్రస్తుతం రామ్ , నితిన్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ చిత్రాలతో పాటు వైష్ణవ్ తేజ్ సరసన జోడి కడుతుంది.

మొదటి చిత్రం తర్వాత కెరీర్‌ను ఆశించిన రీతిలో తీసుకు వెళ్లలేకపోతోన్న వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడితో కలిసి తన నాలుగో సినిమాను చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరును చిత్ర అని పరిచయం చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో శ్రీలీల ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.