73వ గణతంత్ర వేడుకల్లో సరికొత్త సంప్రదాయ డ్రెస్​లో ప్రధాని

న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు అమరవీరులకు నివాళులర్పించేందుకు బుధవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంప్రదాయ డ్రెస్​లో కనిపించారు. ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సైనికులకు నివాళులర్పించారు. ఈ సమయంలో , ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ ప్రత్యేక టోపీని ధరించి కనిపించారు. అంతేకాదు, ఆయన మెడలో మణిపూర్ స్టోల్‌తో దర్శనమిచ్చారు. ప్రధాని మోడీ వస్త్రాదరణకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/