కర్ణాటక నూతన ప్రభుత్వానికి శుభాభినందనలుః కెటిఆర్‌

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు..కెటిఆర్

ktr

హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కెటిఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కర్ణాటక ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపకుండా ‘ది కేరళ స్టోరీ’ ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ప్రభావం చూపవు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. హైదరాబాద్, బెంగళూరు సిటీలు దేశ మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం పోటీ పడాలి’’ అని కెటిఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.