నిఖిల్ ‘స్పై’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్..ప్రస్తుతం ‘స్పై’ మూవీ చేస్తున్నాడు. ప్రముఖ ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ఈ మూవీ తో ద‌ర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

జూమ్ జూమ్ అంటూ సాగే మెలోడియస్ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. విశాల్ చంద్ర శేఖర్ స్వర పరిచిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. కిట్టు విస్సప్రగాడ సాహిత్యం అందించాడు. జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్‌, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.

YouTube video