గాయపడ్డ జనసేన కార్యకర్తలకు పవన్‌ ఓదార్పు

పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను పరామర్శించిన పవన్

Pawan-Kalyan
Pawan-Kalyan

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను ఈ మధ్యాహ్నం పరామర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన జనసేన నేత పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను కలుసుకున్నారు. గాయపడిన మహిళా కార్యకర్తలను ఆప్యాయంగా అక్కునచేర్చుకున్న పవన్ వారిని ఓదార్చారు. వారు చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు తమపై దాడి దృశ్యాలను పవన్ కు మొబైల్ ఫోన్ లో చూపించారు. మరోవైపు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ నివాసం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు భారీగా తరలివస్తుండడంతో పోలీసు బలగాలను మోహరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/