కామారెడ్డి జిల్లాలో దారుణం : మూడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత GHMC వీధి కుక్కల విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి పెద్దగా ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంల ముదెల్లిలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్ బయట ఆడుకుంటున్న బాలుడిపై వీది కుక్కల దాడి చేశాయి. కుక్కలు ఒక్కసారిగా మీద పడడంతో బాలుడి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి తలపైన కూడా గాయాలు అయ్యాయి. వీధి కుక్కలు అటాక్‌ చేయంతో బాలుడి అరుపులు విన్న స్థానికులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరమికొట్టారు. అనంతరం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు సమయానికి స్పందించడంతో బాలుడికి ప్రాణాప్రాయం తప్పింది.