హైద‌రాబాద్‌ కు చేరుకున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్

మరికొద్ది రోజుల్లోనే భారత్ కు 30 ల‌క్ష‌ల డోసులు

Hyderabad: ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ హైద‌రాబాద్‌ కు చేరుకుంది. మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో ఉన్న విమానం హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ వ్యాక్సిన్ల‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కు అప్పగించనున్నారు. దేశంలో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో రెడ్డీస్ లేబొరేట‌రీస్‌ చేతులు క‌లిపింది. ఏప్రిల్ 13న స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే మ‌రో 30 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ కూడా భారత్ కు రానుంది. జూన్ లో 50 లక్షల డోసులు, జూలైలో కోటికి పైగా డోసులు భారత్ కు చేరుకోనున్నాయి

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/