నాలుగో రోజు ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

rahul-padayatra-energizing-congress-leaders-in-bharat-jodo-yatra

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నారు. నాలుగో రోజు కన్యాకుమారిలోని ములగమూడు నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఈ రోజు రాత్రికి కేరళకు చేరుకుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాటు, పలువురు సీనియర్ నేతలు సైతం పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 68 లోక్‌సభ స్థానాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,571 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు . ఐదు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/