కరోనా విజృంభిస్తున్న తరుణంలో టెన్త్, ఇంటర్ పరీక్షలా ?

తక్షణమే రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్ డిమాండ్

Pawan kalyan

Amaravati: ఏపీలో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో టెన్త్ , ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే మొండి వైఖరితో సి ఏం జగన్మోహన్ రెడ్డి విద్యార్ధులను, తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టివేశారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టిందని అన్నారు. శనివారం ఉదయం నుంచి పార్టీ వీర మహిళ విభాగం నేతలు, సభ్యులు తమ ఇళ్లలోనే దీక్షలు నిర్వహించారని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని అన్నారు. కేంద్ర స్థాయిలో సి.బి.ఎస్.ఈ. పరీక్షలను రద్దు చేసారని, పలు రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దుచేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం పాలన చేయాలి కానీ.. శవాలపైకాదని అన్నారు.
ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై మరోసారి పునరాలోచన చేయాలని. పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో తీవ్రంగా విఫలమై… కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేక నిలిపివేసిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. కరోనా పరీక్షలు నిలిపివేసిఎం ఇపుడు విద్యార్ధులకు మాత్రం పరీక్షలుపెట్టడం జగన్
ప్రభుత్వ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పి.యశస్విని, శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినుత కోట, పార్టీ మహిళ నేతలు ఘంటసాల వెంకట లక్ష్మి, రావి సౌజన్య, ఆకేపాటి సుభాషిణి తదితరులతోపాటు పిఠాపురం, అమలాపురం, విజయవాడ, తిరుపతి, నిడదవోలు, ఏలూరు, ఉండి, దెందులూరు, కదిరి, రైల్వేకోడూరు, మదనపల్లి తదితర నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టిన ఈ దీక్షలకు సంఘీభావంగా జనసేన తెలంగాణ వీర మహిళ విభాగం నేతలు హైదరాబాద్ లో దీక్షలు నిర్వహించారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/