రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ హైదరాబాద్‌కు రాక

నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలింపు

Sputnik V vaccine arrives in Hyderabad from Russia
Sputnik V vaccine arrives in Hyderabad from Russia

Hyderabad: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు రెండో విడత గా రష్యా నుంచి హైదరాబాద్‌ చేరాయి. 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. నేరుగా వీటిని రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. 67లక్షల డోసులు కావాలని కంపెనీ ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడుదల వారీగా సరఫరా చేస్తోంది. ఇదిలా ఉండగా జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌ వీ ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రకటించిన విషయం విదితమే. కాగా సోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/