రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ కు ఉద్వాసన
‘నిమ్మగడ్డ’ సంచలన నిర్ణయం

Amaravati: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు ఓ పథకం ప్రకారం విఘాతం కలిగించి, పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారనే అభియోగాలతో… ఎన్నికల కమిషన్ సెక్రటరీ వాణీమోహన్‌ను విధుల నుంచి తొలగించారు.
వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అవసరం లేదంటూ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.
ఈసీ కార్యాలయం నుంచి ఆమెను రిలీవ్ చేశారు. నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జేవీ సాయిప్రసాద్ ను కూడా విధుల నుంచి నిమ్మగడ్డ తొలగించిన సంగతి తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/