విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లుః దక్షిణ మధ్య రైల్వే

train
train

విజయవాడః వేసవి రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల వెతలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా మహబూబ్ నగర్, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

ప్రత్యేక రైళ్లు ఇలా..

.విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ మధ్య నేటి నుంచి ప్రత్యేక రైలు (08585/08586)ను ప్రకటించింది. జూన్ 28 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. విశాఖలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్టణం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది.

.విశాఖపట్ణణం-తిరుపతి మధ్య నేటి నుంచి జూన్ 27వ తేదీ వరకు ప్రత్యేక రైలు (08583/08584) అందుబాటులో ఉంటుంది. విశాఖలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. అనకాపల్లి, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు మీదుగా తిరుపతి చేరుకుంటుంది.

.విశాఖపట్టణం-బెంగళూరు మధ్య ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైలు (08543/08544) నడుస్తుంది. విశాఖలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే, బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇది రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం మీదుగా ప్రయాణిస్తుంది.