అరటితో చర్మ సౌందర్యం

అందమే ఆనందం

చర్మ సౌందర్యానికి అరటి పండు చాలా ఉపయోగకరమైనది.. అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి… అంతే కాదు అరటి పండు చర్మ సౌందర్యానికి కూడా పనికొస్తుంది.. బనానా పేస్ మాస్క్ లతో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది..

skin beauty with banana
skin beauty with banana

మొటిమల నివారణకు:

రెండు టేబుల్ స్పూన్ల అరటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ తాజా నిమ్మ రసం .. ఈ మూడింటినీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిముషాల తర్వాత చల్లటి నీటి తో కడుక్కోవాలి… ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సమస్య తలెత్తదు .

ముడతలు పోవాలంటే?

రెండు టేబుల్ స్పూన్ల అరటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్ స్పూన్ తాజా నిమ్మ రసం కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకోవాలి.. అరగంట తర్వాత చల్లటి నీతితో కడుక్కోవాలి.. ఇలా వారానికి మూడు , నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

చర్మం నిగారింపు కోసం :

రెండు టేబుల్ స్పూన్ల అరటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె రెండూ కలిపి పేస్ట్ లా సుహాసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.. 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడుక్కోవాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది .

తెలంగాణ వార్తల కోసం:https://www.vaartha.com/category/telangana/