సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించని స్పీకర్

హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు , రాజాసింగ్ లను తెలంగాణ అసెంబ్లీలోకి అనుమంతించడం లేదు. బీజేపీ ఎమ్మేల్యేలు తమ సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సస్పెన్షన్ పై స్పీకర్ దే తుది నిర్ణయం అని హైకోర్ట్ తీర్పును ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు తాము రాష్ట్ర అసెంబ్లీ కి వెళ్లి స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఎదుట హాజరవుతారని సస్పెండ్ అయినా బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు సోమవారం రోజు తెలిపారు. స్పీకర్ ముందు ఎమ్మెల్యేల అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాలను చెప్పారు. ప్రతిగా ,సస్పెన్షన్ రద్దుకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుని, ఎమ్మెల్యే రఘునందన్ అసెంబ్లీ సమావేశాల రిమైండర్ లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/andhra-pradesh/