ట్యాంక్‌బండ్ పర్యాటకులకు గుడ్ న్యూస్..

ట్యాంక్‌బండ్ పర్యాటకులకు గుడ్ న్యూస్..ఇక నుండి ట్యాంక్‌బండ్ ఫై మరింత ఉత్సహం నిలకొనబోతుంది. ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 నుండి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించేలా నిర్ణయం తీసుకొని పర్యాటకుల్లో ఆనందం నింపగా..ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. సండేని మరింత ఫన్‌డేగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి ఆదివారం సాయంత్రం నగరవాసుల కోసం సాంస్కృతిక ఉత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించేందుకు సిద్ధమైంది.
అలాగే నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్ పరిసరాలకు ప్రతి ఆదివారం ప్రత్యేక సర్వీసులు నడిపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు ఆర్టీసీ బస్సులు నడుపుతామని, రాత్రివేళ పర్యాటకులు తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందు 10.30 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రణగొణగా ఉండే హుస్సేన్ సాగర్.,.గత రెండు వారాలుగా ఆదివారం సాయంత్రం చాల ప్రశాంతంగా ఉంటుంది. నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో ట్యాంక్‌బండ్ తిరుగుతూ అందాలను ఆస్వాదిస్తున్నారు. దీని తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించడం జరిగింది. అధికారులు ఆ పనిలో కూడా ఉన్నారు.