హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు కీలక తీర్పు

విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు..హై కోర్టు తీర్పు

Wearing hijab not an essential religious practice of Islam, says Karnataka High Court

బెంగుళూరు: హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఈ మేర‌కు విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ యూనిఫాంను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో గత మాసంలో హిజాబ్ తో పాటు, కాషాయ రంగు కండువాలు ధరించి విద్యా సంస్థలకు రావడంపై నిషేధం విధించింది. విద్యా సంస్థల్లోకి హిజాబ్ వేసుకొని రావడంపై వివాదం చేలరేగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ సుమారు 12 మంది ముస్లిం విద్యార్ధులతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై 11 రోజుల విచారణ అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ విషయమై హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించింది.

మరో వైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక అంతటా ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. హిజాబ్ వివాదం ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవును ప్రకటించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/