బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌

వెల్లడించిన కుమారుడు చరణ్‌

బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌
SP Balasubrahmanyam health update

చెన్నై: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరీక్షల్లో తన తండ్రికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరిన్ని వివరాలు తెలుపుతామని ప్రకటనలో పేర్కొన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు, అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణం ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. ఇక ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/