ఫ్లైఓవర్ పూర్తి కావడం సంతోషంగా ఉంది

విజయవాడ: ఎంపి కేశినేని నాని, మోర్త్ రీజనల్ ఆఫీసర్ సింగ్, అధికారులతో కలిసి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి కావడం సంతోషంగా ఉందని అన్నారు. బెజవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందన్నారు. వచ్చెనెల 4న ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/