తీవ్రవాదుల్లో కలిసేందుకు అనుమతి కోరుతూ త్వరలో రాష్ట్రపతికి లేఖ :అమరావతి రైతులు

మందడం దీక్షా శిబిరం వద్ద మహిళలు, రైతుల ఆగ్రహం

Amaravati Farmers Dharna -file
Amaravati Farmers Dharna -file

Amravati: తీవ్రవాదుల్లో కలిసేందుకు రాష్ట్రపతి అనుమతి కోరుతూ త్వరలో లేఖ రాయబోతున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు

బుధవారం మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో మందడంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

దీక్షా శిబిరంలో కూర్చున్న మహిళలను బయటికి పంపించేశారు. మందడంలో బలవంతంగా దుకాణాలు మూయించారు.

పోలీసుల చర్యలపై మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.

మహిళలు ఒక దశలో పోలీసులకు దండాలు పెట్టి వెళ్లిపోవాలని అభ్యర్థించారు.

తామిచ్చిన భూములలో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి తమ వైపు చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడటం లేదని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/