రాజధాని అంశంపై మరోసారి కేంద్రం స్పష్టత

రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని స్పష్టం

ap high court
ap high court

అమరావతి: ఏపిలోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ కేంద్రం తేల్చేసింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపి హైకోర్టుకు తెలియజేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందించింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఏపి హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/