ఏపిలో కొత్తగా 9,742 మందికి కరోనా

మొత్తం కేసులు సంఖ్య..3,16,03…మొత్తంమరణాల సంఖ్య..2,906

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 9,742 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 3,16,003కి చేరింది. గత 24గంటల్లో 86 మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య 2,906కు పెరిగింది. ఏపిలో కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1399 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 1123 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ గోదావరి 919, విశాఖపట్నం 835, చిత్తూరు 830, కర్నూలు 794, నెల్లూరు 755, కడప 673, ప్రకాశం 585, శ్రీకాకుళం 565, గుంటూరు 555, విజయనగరం 428, కృష్ణా జిల్లాలో 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు..


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/