ఏపిలో కొత్తగా 845 కొత్త కేసులు నమోదు

198కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వారిలో గుర్తించగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 4 కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఇప్పటివరకు ఏపిలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది. తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించగా, మృతుల సంఖ్య 198కి పెరిగింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/