రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం..

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ హాజరుకావడం లేదు. మే 28 దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రపాయంగా అంగీకరించారని స్వయంగా సీఎంనే తెలిపారు. అయితే ఆ తర్వాత కూడా ఏఐసీసీ నుంచి సోనియాగాంధీ ఆవిర్భావ వేడుకలకు హాజరవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంతలోనే మళ్లీ సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావడం లేదంటూ కాంగ్రెస్​ వర్గాల నుంచి సమాచారం. పార్టీ సీనియర్ నేత వీహెచ్ కూడా ఇదే విషయం తెలిపారు. అనారోగ్య కారణాలతోనే రావడం లేదని పేర్కొన్నారు.

జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడకలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే సోనియా తెలంగాణ పర్యటన రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.