మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోలు మృతి

మధ్యప్రదేశ్‌లో మావోలకు , పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఈ ఘటన బాలాఘాట్‌లోని కాడ్లా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున బాలాఘాట్‌లోని కాడ్లా అటవీ ప్రాంతంలో మావోల కదలికపై నిఘా పెట్టిన పోలీసులు..వారిపై కాల్పులు జరిపారు. మావోలు కూడా ఎదురు కాల్పులు జరపడం తో..ఈ కాల్పుల ఘటన లో ఇద్దరు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోలో ఏరియా కమిటీ మెంబర్ , భోరందేవ్‌ కమిటీ కమాండర్‌ అయిన సునీత, ఏరియా కమిటీ మెంబర్‌ సరితా ఖాటియా మోచాగా గుర్తించారు.

ఇద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకులు, కాట్రిజ్‌లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాలాఘాట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసుకు శాంతి భద్రతలను కాపాడటం సమస్యగా మారింది. దీంతో నక్సలైట్ల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.