ఎగ్జిట్ పోల్స్ తో మోడీ హ్యాపీ..

PM Modi stands on right side of history: Israeli president praises

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఏడో విడత పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు తమ అంచనాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు చెపుతుండగా.. ఏపీలో మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అంటున్నాయి. అలాగే తెలంగాణలో కూడా బిజెపి కి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెపుతుండడం తో ప్రధాని మోడీ హ్యాపీ గా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్ చేసారు.

“అవకాశవాద INDI కూటమి ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైంది. వారు కులతత్వం, మతతత్వం , అవినీతిపరులు. కొన్ని రాజవంశాలను రక్షించడానికి ఉద్దేశించిన ఈ కూటమి, దేశం కోసం భవిష్యత్తు దృష్టిని అందించడంలో విఫలమైంది. ప్రచారం ద్వారా మోదీని దెబ్బతీయాలన్న ఒక విషయంపై మాత్రమే వారు తమ నైపుణ్యాన్ని పెంచుకున్నారు- ఇలాంటి తిరోగమన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.